![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో... గంగ బయటకు వెళ్తుంటే ఎక్కడకి అని రుద్ర అడుగుతాడు. సూపర్ మార్కెట్ కి సరుకుల కోసమని గంగ చెప్తుంది. దాంతో గంగని రుద్ర తనతో పాటు కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు నేను కిండర్ గార్డెన్ కి వెళ్ళాలి.. చిన్ని వచ్చిందేమోనని గంగ అనుకుంటుంది.
సర్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని గంగ అడుగుతుంది. రుద్ర కోపంగా చూసేసరికి గంగ సైలెంట్ గా ఉండిపోతుంది. సూపర్ మార్కెట్ వచ్చింది దిగు.. లోపల మక్కంకి చెప్పాను.. తనే మళ్ళీ నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాడని గంగకి రుద్ర చెప్తాడు. దాంతో గంగకి ఇక తప్పదు. ఆ తర్వాత గంగ లోపలికి వెళ్లకుండానే మక్కం సరుకులు తీసుకొని వస్తాడు. మేనేజర్ సర్ నాకొక హెల్ప్ చెయ్యాలి.. నేను అర్జెంట్ గా నా ఫ్రెండ్ ని కలవాలని అంటుంది. దానికి మక్కం సరే అనడంతో ఇద్దరు స్కూటీపై వెళ్తారు.
మరొకవైపు చిన్ని వాళ్ళ మేడమ్ వచ్చి ఆటో కోసం చూస్తుంటారు. నేను ఆటో తీసుకొని వస్తానని మేడమ్ చిన్నిని వదిలేసి వెళ్తుంది. ఆ తర్వాత గంగ చిన్ని చెప్పిన అడ్రెస్ కి మక్కంని తీసుకొని వస్తుంది. సర్ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మక్కం భయపడుతుంటే.. సర్ కి ఎలా తెలుస్తుంది. మనం వచ్చిన ప్లేస్ కి సర్ ఏమైనా మనకంటే ముందే వచ్చేస్తాడా అని గంగ అటువైపు తిరుగుతుంది. రుద్ర ఎదురుగా ఉంటాడు. అతన్ని చూసి గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |